కాపు అంటే తెలుగులో "రక్షకుడు" అని అర్ధం. ధక్షిణ భారతంలో కాపుల సంక్షేమానికీ, సమైక్యతకు, సమగ్రతకు, సమర్థతకు సత్యతాముఖాభివృద్ధికి ఏర్పడినధీ ఈ సమాఖ్య "విశ్వ (విశ్వబలిజ, తెలగ, కాపు, ఒంటరి, తూర్పుకాపు) సమాఖ్య". ఈ విశ్వ సమాఖ్య అకుంఠిత దీక్షతో అవిరళ కృషితో, అవిశ్రాంత శ్రమతో కాపుల “సుస్థిర అభివృద్ధి” స్థాపనే ధ్యేయంగా పనిచేస్తుంది.
కాపుల, కాపు బిడ్డల కొరకు వినసొంపై, కనసొంపైన భవనాన్ని నిర్మించి విద్య, ఉద్యోగం, నైపుణ్యం, వ్యాపారం, అంకురాలు, పారిశ్రామిక వ్యవస్థాపకత సాధించడమే పరమావధిగా భావించి అడుగులు వేస్తుంది .............."విశ్వ"
“ఆరాటం ముందు పోరాటం విలువెంత
సంకల్పం ముందు వైకల్యం విలువెంత
ధృఢచిత్తం ముందు దురదృష్టం విలువెంత
ఎదురీత ముందు విధిరాత విలువెంత”